ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ గ్రామాలు: Errabelli

ABN, First Publish Date - 2022-06-08T00:19:13+05:30

ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ గ్రామాలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ గ్రామాలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు. ప్రతి ఊరిలో సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించి, సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై, తమ తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.మంగళవారం మహబుబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని చోక్లా తండా నుండి గురిమెల్ల వరకు  1 కోటి 75 లక్షల రూపాయల వ్యయంతో బిటి రోడ్డు పనులకు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. 


బయ్యారంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే గంథం పల్లిలో సీసీ రోడ్లను, కొత్త పేటలో చెక్ డ్యాంను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్(satyavati rathor) మాట్లాడుతూ పల్లె ప్రగతితో (palle pragati) నేడు గ్రామాలు కళకళలాడుతున్నాయన్నారు. ఏ సమస్య ఉన్నా ప్రజలు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చెబుతున్నారని, దీంతో వెంటనే పరిష్కారం అవుతున్నాయని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని, సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-08T00:19:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising