ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె ప్రగతి ఒక గ్రామీణ జీవన విధానం-ప్రజలంతా భాగస్వాములు కావాలి:Errabelli

ABN, First Publish Date - 2022-06-07T20:51:15+05:30

పల్లె ప్రగతి ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ఒక జీవన విధానంగా చూడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) ప్రజలకు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: పల్లె ప్రగతి ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ఒక జీవన విధానంగా చూడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి,శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) ప్రజలకు పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి(palle pragati) ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా మన గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. మన గ్రామాలను మిగతా రాష్ట్రాలు, దేశం అనుసరిస్తున్నది. పల్లెల అభివృద్ధి వెలుగు విరజిమ్మతూ ఉన్నాయి.ఈ పథకం ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. కేంద్రం అవార్డులు ఇవ్వటమే ఇందుకు నిదర్శనం. ప్రజలంతా భాగస్వాములై, పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమాన్ని జీవన విధానంగా అలవాటు చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను, బమ్మెర  గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం సిసి రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ... గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించడం, ఆయన వారసులుగా చెప్పుకునే వాళ్లకు సాధ్యం కాలేదని, అలాగే ఆ తర్వాత పరిపాలన చేసిన ఎవ్వరికీ చేత కాలేదని అన్నారు. తెలంగాణ తెచ్చిన గాంధీజీలా సీఎం కేసిఆర్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలిచిన అనేక కొత్త పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అందులో ఒకటి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలని అన్నారు. తన రాజకీయ జీవితంలో కూడా పల్లె ప్రగతి వంటి పథకాలను, అవి సాధించిన ఫలితాలను చూడలేదన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ, అభివృద్ధిని గ్రామాలకు పట్టం కడుతూ, సీఎం చేపట్టిన పల్లె ప్రగతి వల్ల మన గ్రామాల రూపు రేఖలే మారాయని చెప్పారు.  పల్లె ప్రగతి తో పారిశుద్ధ్యం పెరిగింది, విష జ్వరాలు దూరమయ్యాయి. అంటురోగాలు మాయమయ్యాయి. ఆరోగ్యాలు మెరుగు పడ్డాయి.కనీస సౌకర్యాలు పెరిగి, గ్రామాలు అభివృద్ధి చెందాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి అని మంత్రి వివరించారు.


గ్రామాల్లో చెత్త సేకరణకు ట్రాక్టర్లు, ట్రాలీలు, మంచి నీటికి ట్యాంకర్లు,  డంపింగ్ యార్డు లు, చెత్తను వేరు చేసే పరిస్థితులు, తద్వారా ఆదాయం పొందే మార్గాలు, కళ్లా లు, రైతు వేదికలు, స్మశాన వాటిక లు వరకు అన్ని సరిగ్గా అమరయాయని మంత్రి వివరించారు.నేనూ మిషన్ భగీరథ నీటినే తాగుతా...46 వేల కోట్లతో గోదావరి జలాలను ఇంటింటికి తాగునీరు గా అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ నీటిని త్రాగాలని తాను కూడా భగీరథ నీటిని తాగుతున్నాను అన్నారు. వైకుంఠధామం అన్ని సౌకర్యాలు కల్పించాలని తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటు న్న0దున ప్రజలు భాగస్వామ్యం అందించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఇల్లు తడి పొడి చెత్తను వేరు చేసి అందించాలని చెత్తను రోడ్లపై వేస్తే జరిమానా విధిస్తామని అన్నారు. 

Updated Date - 2022-06-07T20:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising