ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలోని ఉద్యోగ శిక్షణా శిబిరంలో meterial పంపిణీ

ABN, First Publish Date - 2022-05-25T21:48:25+05:30

ఎర్రబెల్లి ట్రస్ట్(errabelli trust) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణతో పాటు మెటీరియల్ ను పొంది ఉద్యోగాలు సంపాదించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) నిరుద్యోగులకు ఉద్బోధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొర్రూరు: ఎర్రబెల్లి ట్రస్ట్(errabelli trust) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణతో పాటు మెటీరియల్ ను పొంది ఉద్యోగాలు సంపాదించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) నిరుద్యోగులకు ఉద్బోధించారు. శిక్షణ పొందుతున్న వారికి ఉచితంగా మెటీరియల్ ను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ మెటీరియల్ తీసుకోవడమే కాదు, మీరు ఉద్యోగాలు పొంది మా సంకల్పాన్ని నెరవేర్చాలన్నారు. నిరుద్యోగులకు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం మా అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.  శిక్షణ ద్వారా వేలాది మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు. 


అనేక కుటుంబాలు, ప్రత్యేకించి పెళ్ళై, చదువుకోవడానికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న మహిళలు, దూర ప్రాంతాలకు శిక్షణ కోసం వెళ్లలేని వాళ్ళు, శిక్షణ ఫీజులు భారమైన వాళ్లు ఎందరో బాగు పడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గత కొన్నేళ్లుగా ఉషా దయాకర్ రావు అధ్వర్యంలో ఎర్రబెల్లి ట్రస్ట్ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి.అత్యంత నిజాయితీతో ఈ సేవ జరుగుతున్నది. కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, అంబులెన్స్ లు వంటివి ఎన్నో చేశాం.అలాగే ఈ ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించినట్టు తెలిపారు.ఈ శిక్షణ ద్వారా ఇప్పటికే వెయ్యి మందికి పైగా వివిధ ఉద్యోగాలు పొందారని అన్నారు. 


తన నియోజకవర్గంలోని నిరుద్యోగులకు అందుబాటులో ఉండటానికి వీలుగా అటు తొర్రూరు లో తొర్రూరు, రాయపర్తి, పెద్ద వంగర మండలాలకు, ఇటు పాలకుర్తిలో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల వాళ్లకు అందుబాటులో ఉచిత శిక్షణ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి శిక్షణ తీసుకుంటున్న 750 మంది యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T21:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising