ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలమలు రాశిలో తక్కువ సంఖ్యలో ఉన్నావాసిలో గొప్పగా ఉన్నారు

ABN, First Publish Date - 2022-05-01T23:32:59+05:30

వెలమలు రాశిలో తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వాసిలో గొప్పగా ఉన్నారని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: వెలమలు రాశిలో తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వాసిలో గొప్పగా ఉన్నారని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇందుకు కారణం వెలమలు సమాజంలోని అందరిలో కలిసిపోతూ అందరినీ కలుపుకుని పోవడమేనని అన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం 27వ వార్షిక సర్వ సభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు పేరాల మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ విలువలకు కట్టుబడి నీతి, నియమాలు పాటిస్తూ, సమాజ అభివృద్ధి కి కృషి చేస్తున్నందు వల్లనే అనేక మంది వెలమలు రాజకీయ రంగంలోనూ రాణించారని మంత్రి చెప్పారు. 


యతిరాజారావు, వెంకటేశ్వర రావు, రాజేశ్వర్ రావు, ధర్మారావు వంటి అనేక మంది మంచి పేరు తెచ్చుకున్నారు అన్నారు. తను కూడా అన్ని వర్గాలను కలుపుకుని పోతూ అపజయం లేకుండా విజయం సాధించానని చెప్పారు.ఇక సమాజంలో వెలమలకు ఉన్నత కులంగా పేరు ఉన్నప్పటికీ,ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళను అభివృద్ధి లోకి తేవడానికి కృషి జరగాలని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, డీసీసీబీ  చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేశ్వర్ రావు, ధర్మారావు, సంఘం ప్రధాన కార్యదర్శి బొంపల్లి వెంకట్ రావు, సంయుక్త కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్యామ్ సుందర్ రావు,కోశాధికారులు కాకుల మర్రి ప్రవీణ్ కుమార్, పల్లిపాటి విద్యాసాగర్ రావు, గండ్ర సత్యనారాయణరావు, ఉమ్మడి జిల్లా నలు మూలల నుంచి తరలి వచ్చిన వెలమ సామాజిక బా0ధవులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-01T23:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising