ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మిక, కర్షకుల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం: మంత్రి ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2022-05-01T20:21:02+05:30

కార్మిక, కర్షకుల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని పంచాయితీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: కార్మిక, కర్షకుల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని పంచాయితీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం ద్వారా అత్యుత్తమ కార్మిక సంక్షేమం అమలు చేస్తున్నది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఆదివారం మేడే సందర్భంగా పలు చోట్ల జెండాలు ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్మికుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమమ కార్యక్రమాలను వివరించారు. జనగామ జిల్లా దేవరుప్పుల లో యువ చైతన్య యూత్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. అలాగే కామారెడ్డి గూడెం లో హమాలీ సంఘం, పాలకుర్తి లో సీఐటీయూ అధ్వర్యంలో మేడే సందర్భంగా జెండాలు ఆవిష్కరించారు. కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోని టి.ఆర్.ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 


ప్రభుత్వం నిర్మాణ రంగంలోని కార్మికుల సంక్షేమానికి గత ఏడాదిలో 176.91కోట్ల రూపాయల లబ్ది చేకూర్చింది.గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వారా 32,350 మంది కార్మికులకు 184.07 కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరింది.కార్మికశాఖలోని కార్యకలాపాలను పూర్తిగా ఆన్‌లైన్‌ చేసింది.దీని ద్వారా కార్మికులకు ఎక్కడి నుంచైనా ప్రభుత్వ సహకారం పొందే అవకాశం లభిస్తున్నది.దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలు వల్ల అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో తమ కంపెనీ లను పెడుతున్నాయన్నారు. దీని ద్వారా కార్మికులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఉపాధి, వేతనం దొరుకుతున్నదని మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-01T20:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising