ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడా రంగంలోనూ వరంగల్ కు ఎంతో పేరుంది: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2022-02-20T22:23:46+05:30

కళలు సాహిత్యం, చారిత్రక నేపధ్యం ఉన్న వరంగల్ నుంచి ఎంతో క్రీడాకారులు కూడా కీర్తిని గడించారని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: కళలు సాహిత్యం, చారిత్రక నేపధ్యం ఉన్న వరంగల్ నుంచి ఎంతో క్రీడాకారులు కూడా కీర్తిని గడించారని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడో త్సవాలలో ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యం కోసం అవసరం అన్నారు. ఆరోగ్యానికి కూడా క్రీడలు దోహదం చేస్తాయని చెప్పారు. వరంగల్ విద్యా, వైద్య రంగాలలో నే గాక, సాహిత్యం, కలలు,సాంస్కృతిక రంగాలు, క్రీడలకు కూడా ఎంతో పేరుందన్నారు. అర్జున పిచ్చయ్య, వెంకటనారాయణ వంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను మంత్రి గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య,  ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, గండ్ర వెంకట రమణారెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-20T22:23:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising