ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడారం జాతరకు ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2022-02-18T22:05:23+05:30

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ ప్రభుత్వం 75కోట్ల రూపాయలు కేటాయించిందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ ప్రభుత్వం 75కోట్ల రూపాయలు కేటాయించిందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జాతర ఏర్పాట్లు ఘనంగా జరిగాయన్నారు. విజయవంతంగా నిర్వహించ బడుతున్న సమ్మక్క సారలమ్మ జాతర జాతర ప్రారంభమైప్పటినుండి దాదాపు ఒక కోటి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారుని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన  గత 8 ఎండ్ల కాలంలో 4 దఫాలుగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడానికి 381 కోట్ల రూపాయలు వ్యయం చేశామని తెలిపారు, అందులో భాగంగా ఈ సంవత్సరం జాతర నిర్వహణకు 75 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. సమైఖ్య రాష్ట్రంలో వివక్షత వల్ల జాతరలో భక్తుల కోసం ఏర్పాట్లు సరిగా ఉండేవి కావని ఆయన అన్నారు. 


కాని తెలంగాణ రాష్ట్ర ఆవర్భావం పిదప ముఖ్య మంత్రి కేసీఆర్ సమ్మక్క సారలమ్మ జాతర సమగ్ర అభివృద్ధికి తీసుకున్న చర్యల వల్ల భక్తుల ఇబ్బందులు పూర్తిగా తీరాయని ఆయన తెలిపారు.జాతరలో భక్తులకు మంచి నీటి సరఫరా, జాతర ప్రాంగణంలో లైటింగ్ నిరంతరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అంతే కాకుండా జాతరలో భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక వైద్య ఆరోగ్య శిబిరాలు పెద్ద ఎత్తున  వైద్య ఆరోగ్య శాఖ  అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు.అమ్మ వారి గద్దెల వద్ద ఏర్పాటు చేసిన  క్యూలైన్ ల పటిష్టమైన భద్రతా చర్యల వల్ల త్వరగా భక్తులు దర్శచుంకుంటున్నరని  తెలిపారు.జంపన్న వాగు వద్ద భక్తుల  సౌకర్యాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని ఆయన అన్నారు. ఒకప్పుడు వరంగల్ నుండి మేడారం జాతరకు రావడానికి 6 నుండీ 10గంటల సమయం పట్టిందని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు విశాలమైన రోడ్డు సౌకర్యం వల్ల పోలీస్ బందోబస్తు వల్ల త్వరితగిన భక్తులు మేడారం జాతరకు వెళ్ళి అమ్మ వార్ల దర్శనం చేసుకొని తిరిగి వస్తున్నారని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-02-18T22:05:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising