ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడారం మహా జాతరలో ప్రజలతో కలిసిపోయిన మంత్రి ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2022-02-18T21:07:17+05:30

మేడారం మహా జాతర ఏర్పాట్లను తనిఖీ చేస్తూనే, వచ్చే భక్తులతో కలిసి పోయి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను పరిశీలిస్తూ మంత్రి ఎర్రబెల్లి హడావిడి చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: మేడారం మహా జాతర ఏర్పాట్లను తనిఖీ చేస్తూనే, వచ్చే భక్తులతో కలిసి పోయి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను పరిశీలిస్తూ మంత్రి ఎర్రబెల్లి హడావిడి చేశారు. వీ ఐ పీ లు, వి. వీ ఐ పీ లు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కూడా ఎదుర్కొని వాళ్లకు దర్శనం కలిపిస్తూ, అధికారులతో కలిసి సమన్వయ పరుస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి మేడారం జాతర జరిగే తీరును పరిశీలిస్తూ, అధికారులకు తగు  ఆదేశాలు ఇస్తూ, మైకులో భక్తులతో మాట్లాడి పలు సూచనలు చేస్తున్నారు. మేడారం మహా జాతర నిర్వహణ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మంత్రి కీలక పాత్ర పోషిస్తున్నారు. ముందుగా సీఎం కెసిఆర్ మేడారం రానున్ననేపధ్యంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తో కలిసి హెలిప్యాడ్ ను పరిశీలించారు. ఆ తర్వాత గద్దెల వద్దకు చేరుకుని అక్కడ పరిస్థితులను సమీక్షించారు. 


మైకు లో మాట్లాడుతూ భక్తి ప్రపత్తులతో అమ్మవారిని కొలుచుకే భక్తులు క్యూ పద్ధతిని పాటిస్తూ, తోపులాట లేకుండా, బంగారం, కొబ్బరికాయలు విసిరి వేయకుండా జాగ్రత్త వహించాలని భక్తులకు సూచనలు చేశారు. అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడి భక్తులకు ఇబ్బందులు కలగకుండా  గద్దెల ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అదేశించారు.సీఎం బస ఏర్పాట్లను పరిశీలిస్తూ..సీఎం కెసిఆర్ కొద్దిసేపు ఉండే, భోజనం చేసే ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లు చేస్తున్న అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే, కమాండ్ కంట్రోల్ రూం ను పరిశీలించారు. అక్కడి నుంచి మేడారం జాతర సీసీ కెమెరాల తో మొత్తం జాతర చుట్టు ముట్టు ప్రాంతాలను పరిశీలించారు.క్యూ లైన్లలోకి వెళ్లి భక్తులను పలకరిస్తూ...ఆతర్వాత క్యూ లైన్లలో కి వెళ్లి భక్తులతో మాట్లాడారు.ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి ఎదురు పడగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రేణుక సింగ్ కు ఎర్రబెల్లి ని పరిచయం చేస్తూ, తెలంగాణలో గట్టి మంత్రి అంటూ చేతులతో గట్టి అనే అర్థం స్ఫురించేలా ఊపుతూ ప్రశంసించారు. 

Updated Date - 2022-02-18T21:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising