ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2022-02-13T20:49:53+05:30

జిల్లాలోని మేడారంలో ఈ నెల 16 నుండి 19 వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తీ చేసిందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: జిల్లాలోని మేడారంలో ఈ నెల 16 నుండి 19 వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తీ చేసిందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.ఆదివారం మేడారం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తూ మార్గమధ్యంలో ములుగు సమీపంలో ఉన్న శ్రీ గట్టమ్మ తల్లి దేవాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని అయన తెలిపారు.


మేడారం జాతరను సందర్శించే ముందు మార్గమధ్యంలో ఉన్న గట్టమ్మ తల్లిని ముందుగా సందర్శించడం ఆనవాయితీ అని మంత్రి తెలిపారు. గట్టమ్మ తల్లి దేవాలయ దర్శనంకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యలు కల్పించామని అయన తెలిపారు. అంతకుముందు పూజారులు ఆలయ అధికారులు మంత్రి దయాకర్ రావుకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. 

Updated Date - 2022-02-13T20:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising