ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ వచ్చాక పల్లెల రూపురేఖలు మారిపోయాయి

ABN, First Publish Date - 2022-01-10T23:03:32+05:30

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పల్లెల రూపు రేఖలు మారిపోయాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పల్లెల రూపు రేఖలు మారిపోయాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప‌ల్లె ప్ర‌గ‌తి ప‌థ‌కం సాధించిన ప్ర‌గ‌తినంతా క‌వి, ర‌చ‌యిత‌, తెలంగాణ సాహిత్య అకాడ‌మీ చైర్మ‌న్ జూలూరు గౌరీశంక‌ర్ త‌న పచ్చా ప‌చ్చ‌ని ప‌ల్లె అనే గ్రంథంలో నిక్షిప్తం చేశార‌ని ఆయన కొనియాడారు.గౌరీ శంక‌ర్ సోమ‌వారం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి త‌న ప‌చ్చా ప‌చ్చ‌ని ప‌ల్లె పుస్త‌కాన్ని అంద‌చేశారు. 


ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి కేసిఆర్ దార్శనిక ఆలోచ‌న‌ల‌న్నీ ఈ గ్రంథంలో ఉన్నాయ‌న్నారు. గ్రామీణ భార‌త చ‌రిత్ర‌లో మ‌న ప‌ల్లెలు ఊహించ‌ని విధంగా సాధించిన పురోగ‌తికి ఈ పుస్త‌కం నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ప‌ల్లెల‌ను ఆధునీక‌రించుకుంటూ, ప‌ల్లెల పున‌ర్నిర్మాణం జ‌రుగుతున్న‌ద‌ని చెప్పారు. ర‌చ‌యిత గౌరీ శంక‌ర్‌ను మంత్రి అభినందించారు.

Updated Date - 2022-01-10T23:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising