ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక పాలపై బాదుడు

ABN, First Publish Date - 2022-04-14T07:19:11+05:30

సామాన్యులపై ధరల భారం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విజయ పాలు లీటరుకు రూ.2 పెంపు
  • రేపటి నుంచి కొత్త ధరలు 
  • 4 నెలల్లో రెండో సారి పెంపు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): సామాన్యులపై ధరల భారం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, వంటనూనెలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై ఇప్పుడు మరో భారం పడనుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయ డెయిరీ పాల ధరలను పెంచుతూ నిర్ణయం  తీసుకుంది. లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది.


లీటరు టోన్డ్‌ మిల్క్‌ ధర ప్రస్తుతం రూ.49 ఉండగా దాన్ని రూ.51 చేశారు. 500 మి.లీ డబుల్‌ టోన్డ్‌ మిల్క్‌ ధర రూ.23 నుంచి 24కి; టీ స్పెషల్‌ రూ.24 నుంచి 25కి; టోన్డ్‌ మిల్క్‌, ఆవు పాలు రూ.25 నుంచి 26కి, హోల్‌ మిల్క్‌ రూ.33 నుంచి 34కి పెంచారు. పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. విజయ డెయిరీ గడిచిన నాలుగు నెలల్లో పాల ధరలను పెంచడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరి 1న లీటరుకు రూ.2-4 పెంచిన విషయం తెలిసిందే.


Updated Date - 2022-04-14T07:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising