ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఈపీకి వ్యతిరేకంగా మిలిటెంట్‌ పోరాటాలు!

ABN, First Publish Date - 2022-12-16T03:39:22+05:30

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలవంతంగా నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలుకు చర్యలు తీసుకుంటోందని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌ఎ్‌ఫఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిశ్వాస్‌ హెచ్చరిక

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలవంతంగా నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలుకు చర్యలు తీసుకుంటోందని, ఆ ప్రయత్నాలను విరమించుకోకుంటే దేశవ్యాప్తంగా మిలిటెంట్‌ పోరాటాలు తప్పవని ఎస్‌ఎ్‌ఫఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిశ్వాస్‌ హెచ్చరించారు. ఎస్‌ఎ్‌ఫఐ జాతీయ మహాసభల్లో భాగంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థి సంఘాల ఎన్నికలను రద్దు చేయటం వల్ల భవిష్యత్తులో దేశానికి నిఖార్సైన నాయకత్వం కరువవుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. గుజరాత్‌ మోడల్‌ అంటే విద్యా వ్యవస్థను ధ్వంసం చేయడమేనని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలను రద్దు చేసిందన్నారు. ఎన్‌ఈపీతో ేస్టట్‌ బోర్డులు రద్దవుతాయని, దాంతో పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఎన్‌ఈపీ అంటే నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ కాదని అది నేషనల్‌ ఎక్స్‌క్లూజన్‌ పాలసీ అని మయూక్‌ అన్నారు. కాగా, ఉస్మానియా వర్సిటీలో జరుగుతున్న ఎస్‌ఎ్‌ఫఐ 17వ జాతీయ మహాసభల్లో భాగంగా ప్రతినిధుల సభ గురువారం సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించింది. సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా జరిగే అన్ని పోరాటాలకు సంఘీభావంగా నిలుస్తామని, ఫెడరల్‌ స్ఫూర్తికి కట్టుబడి ఉన్న ప్రజాస్వామ్య, లౌకికవాద శక్తులకు అండగా నిలుస్తామని ఎస్‌ఎ్‌ఫఐ ప్రతినిధుల సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.

ఉపకార వేతనాల రద్దు సరికాదు: ఏఐఎస్‌ఎఫ్‌

ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేేస మైనారిటీ పరిశోధక విద్యార్థులకు మౌలానా ఆజాద్‌ పేరిట ఇచ్చే ఉపకార వేతనాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని భేషరతుగా ఉపసంహరించుకోవాలని ఏఐఎ్‌సఎఫ్‌ జాతీయ కార్యదర్శి విక్కీ మహేశరీ డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఏఐఎ్‌సఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నారాయణగూడ వై జంక్షన్‌లో గురువారం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విక్కీ మహేశరీ మాట్లాడారు. మౌలానా ఆజాద్‌ ఉపకార వేతనాలను రద్దు చేయడంతో ఆ వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. ఏఐఎ్‌సఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. మైనారిటీలను ఉన్నత విద్యకు దూరం చేయడానికి మోదీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

Updated Date - 2022-12-16T03:39:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising