ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయిలో ప్రవాసీ కార్మికుల ఆకలి కేకలు

ABN, First Publish Date - 2022-07-04T09:33:54+05:30

ఎడారి దేశంలో వేతనాలు అందక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రవాసీలకు తెలుగు అసోసియేషన్‌ అండగా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆహార సామగ్రి అందించిన తెలుగు అసోసియేషన్‌

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ప్రతినిధి: ఎడారి దేశంలో వేతనాలు అందక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రవాసీలకు తెలుగు అసోసియేషన్‌ అండగా నిలిచింది. యూఏఈలోని ఫుజిరా నగరంలో ఉన్న ఒక క్వారీ సంస్థలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారితో పాటు 20 మంది బారతీయ ప్రవాసీలు చాలా కాలంగా పనిచేస్తున్నారు. సంవత్సరం కాలంగా వారికి సంస్థ వేతనాలు చెల్లించడంలేదు. స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలనుకొన్న ఆ కార్మికులకు గ్రాట్యుటీ, బకాయి వేతనాలు కూడా ఇవ్వడం లేదు. తినడానికి తిండి లేక అలమటిస్తున్న వారి దుస్థితి గురించి భారతీయ కాన్సులేట్‌ ద్వారా తెలుసుకున్న దుబాయిలోని తెలుగు అసోసియేషన్‌.. బాధితులకు తోచినంత సాయం చేసింది. అసోసియేషన్‌కు చెందిన సాయికృష్ణ, చైతన్య, భీంశంకర్‌, ఫహీం, సాయి ప్రకాశ్‌, విజయభాస్కర్‌ తదితరులు ఫుజిరాకు వెళ్లి.. పస్తులుంటున్న కార్మికులకు నెలరోజులకు సరిపడ ఆహార సామగ్రి, ఇతర నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులను దుబాయిలోని భారతీయ కాన్సులేట్‌ అధికారిణి తాడు మాము అభినందించారు. గతంలోనూ ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసీలకు ఈ సంఘం సహాయక కార్యక్రమాలు చేపట్టింది.

Updated Date - 2022-07-04T09:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising