ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి

ABN, First Publish Date - 2022-07-17T16:05:44+05:30

మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 10,45,520 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్: మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 10,45,520 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. మేడిగడ్డ దగ్గర మొత్తం 85 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు. సరస్వతి బ్యారేజ్లోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. సరస్వతి ప్రాజెక్టు ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 39,386 క్యూసెక్కులుగా ఉంది. సరస్వతి బ్యారేజ్ ప్రస్తుత నీటి మట్టం 0.15 టీఎంసీలున్నాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విరామం లేకుండా పడిన వర్షాలు, కురిసిన ముసురు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గురువారం నుంచి వర్షాలు కాస్త తెరిపి ఇవ్వడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ భారీవర్షాలకు వరదనీరంతా పొల్లాలో చేరడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నీరంతా బయటకు వెళ్లడానికి మరో రెండు మూడు రోజులు పట్టేలా ఉంది. ఇప్పటికే చేలల్లో చాలాచోట్ల పత్తి మొక్కలు కుళ్లిపోవడం చూసి రైతులు దిగాలు పడుతున్నారు. దీని వల్ల  పంటకు నష్టం తప్పకపోవచ్చునని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి ఎక్కడ నీళ్లపాలవుతుందోనని ఆవేదన చెందుతున్నారు.

Updated Date - 2022-07-17T16:05:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising