ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉర్ధూ జీవ భాష....దానిని బతికించుకోవాలి

ABN, First Publish Date - 2022-06-27T02:33:10+05:30

ఉర్దూ ఒక జీవ భాష, అది బతకాలని, దాన్ని బతికించుకోవడం మన అందరి బాధ్యత అని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉర్దూ ఒక జీవ భాష, అది బతకాలని, దాన్ని బతికించుకోవడం మన అందరి బాధ్యత అని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. అదే విధంగా తెలుగు భాషకు కూడా పూర్తి ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఉర్ధూజర్నలిస్టులకు హైదరాబాద్ పాత బస్తీ, ఉర్దూ మస్కన్ ఆడిటోరియం లో నిర్వహించిన రెండు రోజుల శిక్షణా శిబిరం ఆదివారం విజయవంతంగా ముగిసింది.ఈ ముగింపు కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీకి  నిర్వహించే పరీక్షలు ఉర్దూలో కూడా రాయవచ్చు అన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో,  హిందీ రాష్ట్ర భాష అయినా దేశంలోని ఇతర భాషలు కూడా పరిఢవిల్లాలని ఆయన సూచించారు. 


ఉర్దూ జర్నలిస్టులు తమ వృత్తిని బాధ్యతాయుతంగా చేయాలని, భాషలో నైపుణ్యం సాధించి, నిజాలను నిక్కచ్చిగా ప్రజలకు చేర్చాలని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనమండలి సభ్యులు జాఫ్రీ సూచించారు. గ్రామీణ ప్రాంతమైన, పట్టణమైన రూల్స్ కు కట్టుబడి వార్తలు రాయాలని అన్నారు. 20 సంవత్సరాల క్రితం ఉన్న జర్నలిజానికి, ఇప్పుడున్న జర్నలిజానికి మధ్య ఎన్నో మార్పులు వచ్చాయని, ఇప్పుడు సోషల్ మీడియా ప్రాముఖ్యత విశేషంగా పెరిగిందని, ఇంతకు ముందులా జర్నలిస్టులు శిక్షణ పొందిన తర్వాత రిపోర్టింగ్ చేయడం లేదని, నేటి యువకులు శిక్షణ లేని డిజిటల్ మీడియాని ఆశ్రయిస్తున్నారని ఆయన అన్నారు.

Updated Date - 2022-06-27T02:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising