ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాజాతర విజయవంతానికి సహకరించాలి

ABN, First Publish Date - 2022-01-13T05:49:55+05:30

మహాజాతర విజయవంతానికి సహకరించాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదివాసీ సంఘాల నేతలతో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

ములుగు కలెక్టరేట్‌, జనవరి 12: ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర విజయవంతానికి అందరూ సహకరించాలని కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య కోరారు. బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసీ పెద్దలు, ఆదివాసీ సంఘాల నేతలతో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.  మేడారం మహాజాతరలో ఆదివాసీ సంఘాలకు 22 మద్యం షాపులు కేటాయించినట్లు తెలిపారు. తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ మద్యం, బెల్లం, కొబ్బరికాయల షాపుల నిర్వహణకు వారంరోజులే కాకుండా తిరుగువారం వరకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈనెల 19న మళ్లీ అన్ని సంఘాల పెద్దలు, ఆదివాసీ పెద్దలతో మేడారంలో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీఆర్వో రమాదేవి, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, డీటీడీవో మంకిడి ఎర్రయ్య, తాడ్వాయి తహసీల్దార్‌ శ్రీనివాస్‌, పెసా జిల్లా కోఆర్డినేటర్‌ కొమురం ప్రభాకర్‌, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-13T05:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising