TS News: ఏడుపాయల ఆలయం వద్ద తగ్గని వరద ఉధృతి
ABN, First Publish Date - 2022-10-17T15:45:29+05:30
జిల్లాలోని పాపన్నపేటలోని ఏడుపాయల ఆలయం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది.
మెదక్: జిల్లాలోని పాపన్నపేటలోని ఏడుపాయల ఆలయం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో గత నాలుగు రోజులుగా వనదుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా నది ప్రవహిస్తోంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.
Updated Date - 2022-10-17T15:45:29+05:30 IST