ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి జీజీహెచ్‌ ఎదుట కార్మికుల ధర్నా

ABN, First Publish Date - 2022-12-15T23:59:44+05:30

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సంగారెడ్డి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పనిచేసే కార్మికులు గురువారం ఆందోళనకు దిగారు.

అత్యవసర విభాగం ఎదుట బైఠాయించిన కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 15: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సంగారెడ్డి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పనిచేసే కార్మికులు గురువారం ఆందోళనకు దిగారు. ఆస్పత్రి అత్యవసర విభాగం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. వారికి మెడికల్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి యాదగిరి మద్దతు తెలిపి, మాట్లాడారు. కార్మికులకు రూ.15,600ల వేతనం చెల్లించాలని ఉత్తర్వులు వచ్చినా అమలు చేయడం లేదన్నారు. పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, వేతనాలను బ్యాంకు ద్వారా చెల్లింపులు చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, యాదగిరి, రమేశ్‌, ఆంజనేయులు, మరియమ్మ, శోభ, రమాదేవీ, శారద, నర్సింలు, వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:59:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising