ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ను ముట్టడించిన కార్మికులు

ABN, First Publish Date - 2022-12-07T23:57:52+05:30

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌

సంగారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి టౌన్‌, డిసెంబరు 7: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు సంగారెడ్డి మున్సిపల్‌ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. సీఐటీయూ అనుబంధ సంస్థ అయిన మున్సిపల్‌ కాంట్రాక్టు వర్కర్లు, ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్‌ మెయిన్‌ గేట్‌ను ముసివేసి మూడు గంటల పాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు మాట్లాడుతూ.. మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన వారందిరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని, సొంత స్థలం ఉంటే రూ.3లక్షలకు బదులుగా రూ.5లక్షలు ఇవ్వాలని, 11వ పీఆర్‌సీ ప్రకారం వివిధ కేటగిరీల ఆధారంగా కార్మికులకు రూ.30 వేల నుంచి రూ.40వేలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న ఏరియర్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం.యాదగిరి, రాజు, సువర్ణ, వేణు, నర్సింలు, యాదయ్య, లక్ష్మినారాయణ, రాజేశ్‌, నాగరాణి, అలివేణి, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:57:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising