మనస్తాపంతో మహిళ అత్మహత్య
ABN, First Publish Date - 2022-10-08T05:10:26+05:30
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని చండూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది.
చిల్‌పచేడ్, అక్టోబరు 7: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని చండూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిల్‌పచెడ్ మండలంలోని చండూరు గ్రామానికి చెందిన ముకుంద సంతో్‌షకూమార్, నవనీత దంపతులు. గత కొన్ని రోజులుగా నవనీత అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆస్పత్రుల్లో చూపించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురైంది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్తతో పాటు కూమారుడు, కూతురు ఉన్నారు.
Updated Date - 2022-10-08T05:10:26+05:30 IST