ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వింటర్‌.. డేంజర్‌!

ABN, First Publish Date - 2022-11-27T23:53:40+05:30

రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత వ్యాధులు ప్రబలే అవకాశం అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

ఉదయం వేళలో కురుస్తున్న మంచు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నకోడూరు, నవంబరు 27: చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఉదయం వేళల్లో మంచు కురుస్తూ, సాయంత్రం వేళల్లో చల్లని గాలులు వీస్తూ చలి వణికిస్తుంది. చలికాలంలో జాగ్రత్తలు తీసుకోకుంటే వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వివిధ రుగ్మతలు ఉన్నవారు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిసున్నారు.

గ్లిజరిన్‌ సబ్బులే మేలు

చలికాలంలో చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండటానికి గ్లిజరిన్‌ సబ్బుల వాడకం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారుతోంది. గోరు వెచ్చని నీటితో కాళ్లు, చేతులు, పాదాలను శుభ్రంగా కడుక్కొని, పొడి గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి. వ్యాజిలేన్‌, చర్మ క్రిములు రాసుకోవాలి. చలికి పెదాలు పగిలి రక్తం కారకుండా పెదాలకు వ్యాజిలిన్‌, లిప్‌బామ్‌ రాసుకోవాలి.

పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ

చిన్నపిల్లలు, వృద్ధులపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో పిల్లల్లో న్యుమోనియా వచ్చే ఆవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చలి నుంచి రక్షణ కోసం వెచ్చటి దుస్తులను (స్వెటర్లు) తొడగాలి. వేడినీటితో స్నానం చేయించాలి. చలికాలంలో ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఉదయం, రాత్రి వేళల్లో పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ఉన్ని దుస్తులు ధరించాలి. చేతులకు గ్లౌజ్‌లు, తలకు మంకీ క్యాప్‌, కాళ్లకు షూ ధరించాలి. శరీరానికి వేడి కల్గించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. గోరు వెచ్చని నీటిని తాగాలి.

ఆస్తమా, గుండె జబ్బులు ఉంటే...

ఆస్తమా ఉన్నవారు చలికాలంలో నిత్యం వాడే మందులను సిద్ధంగా ఉంచుకోవాలి. దుమ్ము, దూళి వెదజల్లే ప్రాంతాలకు, పనులకు దూరంగా ఉండాలి. చల్లని వాతావరణంలో బయట తిరగకూడదు. వైద్యుల సలహాల మేరకు మందులు వాడాలి. ఎన్‌హేలర్‌, నెబ్యులైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలి. గుండె జబ్బులు ఉన్నవారు, గుండె ఆపరేషన్‌ చేసుకున్నవారు చలికాలంలో వాకింగ్‌ చేయకూడదు. చలిలో ఎక్కువగా తిరిగితే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్‌ ఉన్నవారు కూడా జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

Updated Date - 2022-11-27T23:53:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising