ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నాచగిరి క్షేత్రం అభివృద్ధికి కృషి చేస్తా

ABN, First Publish Date - 2022-01-28T05:15:09+05:30

నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం అభివృద్ధిపై రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. గురువారం వర్గల్‌ మండలం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రాన్ని ఆయన సందర్శించారు.

ఆలయ మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలిస్తున్న కమిషనర్‌ అనిల్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలయం వద్ద డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేయాలి

రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌


వర్గల్‌, జనవరి 27 : నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం అభివృద్ధిపై రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. గురువారం వర్గల్‌ మండలం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై ధర్మకర్తల మండలి, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ ఆలయం వద్ద డైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మరమ్మతులు చేయించాలన్నారు. ఆలయ మాస్టర్‌ప్లాన్‌ను త్వరలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఆలయ పరిసరాలను, పుష్కరిణి, ఆలయ సముదాయాలను సందర్శించారు. క్షేత్రానికి వచ్చిన ఆయనకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ శభ్నవీసు హన్మంతరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్ట సుధాకర్‌రెడ్డి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఆయన వెంట దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు వల్లి నాయకన్‌, ఎస్‌ఈ మల్లికార్జున్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు రాములు గౌడ్‌, నంగునూరి సత్యనారయణ, బుద్ద రాజు, నరేష్‌, బిమప్ప, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-01-28T05:15:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising