ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నందీశ్వర, బసవేశ్వర శిలా విగ్రహాల ఏర్పాటు ఎప్పుడో?

ABN, First Publish Date - 2022-11-20T23:18:31+05:30

చేర్యాల, నవంబరు 20: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి సూచకంగా, వీరశైవ ఆగమానికి ఆనవాలు ప్రతిబింబింపజేసేందుకు రాజీవ్‌ రహదారిని ఆనుకుని కొండపాక స్వాగతతోరణం ఆవరణలో నందీశ్వర, బసవేశ్వర శిలావిగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా అధికారులు, ఆలయవర్గాల అనాలోచిత నిర్ణయం కారణంగా అమలుకు నోచుకోవడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడాది క్రితం భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

ఏడాది గడిచినా అతీగతీ లేని వైనం

చేర్యాల, నవంబరు 20: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి సూచకంగా, వీరశైవ ఆగమానికి ఆనవాలు ప్రతిబింబింపజేసేందుకు రాజీవ్‌ రహదారిని ఆనుకుని కొండపాక స్వాగతతోరణం ఆవరణలో నందీశ్వర, బసవేశ్వర శిలావిగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా అధికారులు, ఆలయవర్గాల అనాలోచిత నిర్ణయం కారణంగా అమలుకు నోచుకోవడం లేదు. ఏడాదిన్నర క్రితం ఆలయవర్గాలు రూ.1.50 లక్షలతో నందీశ్వర, బసవేశ్వర విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయించారు. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఓంకారం ధనుంజయగౌడ్‌ దాతగా వ్యవహరించడంతో శిలావిగ్రహాలను తీసుకొచ్చారు. దీంతో 12 ఆగస్టు 2021న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతులమీదుగా భూమి పూజ చేయించారు. కానీ ఏడాది గడిచినా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో నందీశ్వర విగ్రహం శివలింగం ఆవరణలో మూలుగుతున్నది.

విగ్రహ సైజుల మార్పు నిర్ణయం పట్ల అయోమయం

సీఎం కేసీఆర్‌ మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ప్రార ంభించిన అనంతరం కాళేశ్వర జలాలను మల్లన్నకు అభిషేకించేందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో కొండపాక స్వాగతతోరణం నుంచి మల్లన్న ఆలయం వరకు గల సింగిల్‌ లేన్‌ బీటీరోడ్డును డబుల్‌ లేన్‌ రోడ్డుగా మార్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. మంత్రి హరీశ్‌రావు చొరవ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విన్నపం మేరకు ప్రభుత్వం రూ.10.32 కోట్ల నిధులు మంజూరు చేసింది. కానీ ముందస్తుగా ఆలయవర్గాలు రోడ్డు విస్తరణ విషయం విస్మరించి చిన్నపాటి విగ్రహాలను తీసుకొచ్చారు. మరికొద్దినెలల్లో రోడ్డు విస్తరణ చేపట్టనుండటంతో ఏం చేయాలోనని డోలాయమానంలో పడిపోయారు. పెద్దవి ఏర్పాటుచేస్తే అదనపు వ్యయం చేకూరనుండటం, దేవాదాయశాఖ కమిషనర్‌ అనుమతికి సమయం పట్టనుండగా, ఇప్పటికే తీసుకొచ్చిన విగ్రహాలను విస్మరిస్తే భక్తుడి ఔదార్యంపై చిన్నచూపు వహించారన్న అపవాదు భరించాల్సిన పరిస్థితి నెలకొన్నది. పాలకమండలి, దేవాదాయశాఖ అధికారులు పునఃపరిశీలన జరిపి ఆయా విగ్రహాలను త్వరగా ఏర్పాటుచేయాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - 2022-11-20T23:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising