ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఓడీఎఫ్‌’ను కాపాడుకుంటాం

ABN, First Publish Date - 2022-03-06T05:15:08+05:30

1983లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఏర్పాటుచేసిన ఓడీఎఫ్‌ (ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ) పరిశ్రమను ప్రైవేటీకరించడం వల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోదీ  నిర్ణయాలను పార్లమెంట్‌లో నిలదీస్తాం

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి


 సంగారెడ్డిటౌన్‌, మార్చి 5: 1983లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఏర్పాటుచేసిన ఓడీఎఫ్‌ (ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ) పరిశ్రమను ప్రైవేటీకరించడం వల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని డీసీఎంఎస్‌ కార్యాలయంలో శనివారం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

 కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పరిశ్రమలను ప్రధాన మంత్రి మోదీ ప్రైవేటీకరిస్తున్నారన్నారు. ఓడీఎ్‌ఫను తామంతా కలిసి కాపాడుకుంటామని అన్నారు. ఓడీఎ్‌ఫను ప్రైవేట్‌పరం చేయడంతో అందులో ఉన్న ఆస్పత్రిని మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం దుర్మార్గపు చర్య అన్నారు. ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఓడీఎ్‌ఫలో పనిచేస్తున్న 8వేల మంది ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఓడీఎఫ్‌ ఏర్పాటు సమయంలో రైతుల నుంచి 3,200 ఎకరాల భూమిని తక్కువ ధరకే కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. ప్రస్తుతం ఆ భూముల విలువ పెరగడంతో భూములను కూడా ప్రైవేట్‌పరం చేసే కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడీఎ్‌ఫను ప్రైవేట్‌పరం చేస్తే పరిశ్రమ కోసం రైతులు ఇచ్చిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. తమ భూములను తీసుకుని కార్పొరేట్లకు కట్టబెడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంపై పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌లో ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తామన్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తమను ఓడించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌ సహకారంతో అభివృద్ధి కోసం పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చామన్నారు. ఇటీవల నారాయణఖేడ్‌ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన రూ.50 కోట్లను అందరికీ సమానంగా పంచాలనడం సరికాదన్నారు. సమస్యలు ఎక్కువ ఎక్కడ ఉంటే ప్రాధాన్యతా క్రమంలో నిధులను ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో నియోజకవర్గంలోని 40వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని, గల్లీకో ఏటీఎం పెడతానని ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట నిలబెట్టుకోలేకపోయాడని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో జగ్గారెడ్డి సతీమణి, కూతురు ఏడిస్తే ప్రజలు ఓట్లేసి గెలిపించి ఐదేళ్లపాటు ఏడుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సమావేశంలో డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ పట్నం మాణిక్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్‌ కాసాల బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మనోహర్‌గౌడ్‌, మధుసూదన్‌రెడ్డి, చక్రపాణి, ఆర్‌.వెంకటేశ్వర్లు, పెరుమాండ్ల నర్సిములు, జలందర్‌రావు, రాంరెడ్డి పలువురు పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-06T05:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising