ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన ఊరు-మన బడి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించను

ABN, First Publish Date - 2022-12-07T23:55:59+05:30

సంగారెడ్డి కలెక్టర్‌ శరత్‌

సంగారెడ్డి కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సాయుధ దళాలకు విరాళాన్ని అందజేస్తున్న కలెక్టర్‌ శరత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 7: జిల్లాలో మన ఊరు-మన బడి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోనని, పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో మొదటి దశలో 441 పాఠశాలల్లో పనులు ప్రారంభిస్తే పలు డివిజన్‌లలో నత్తనడకన సాగుతున్నాయని ఇంజనీరింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆశయం నెరవేరేలా పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈఈలు, డీఈలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని చెప్పారు. సమీక్ష సమావేశంలో డీఈవో రాజేష్‌, అధికారులు పాల్గొన్నారు.

భారత త్రివిధ దళాల సంక్షేమానికి చేయూత

దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరువలేనివని, వారి సంక్షేమానికి చేయూనందివ్వాలని కలెక్టర్‌ శరత్‌ పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సావాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బుధవారం తన వంతు విరాళాన్ని అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో రీజినల్‌ సైనిక సంక్షేమ అధికారి శ్రీనే్‌షకుమార్‌, సిబ్బంది సరస్వతి, నాగేశ్వర్‌రావు, మాజీ సైనికులు దశరథ్‌, లక్ష్మీనారాయణ, నర్సింలు, రాములు, చంద్రసేనుడు, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising