ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీనివాస్‌కు కృత్రిమ కాలు ఏర్పాటుకు సహాయ, సహకారాలు అందిస్తాం

ABN, First Publish Date - 2022-06-12T04:48:40+05:30

శ్రీనివాస్‌ కృత్రిమ కాలు ఏర్పాటుకు పూర్తిస్థాయి సహాయ, సహకారాలు అందిస్తామని టీఎస్‌ ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి

గజ్వేల్‌, జూన్‌ 11: శ్రీనివాస్‌ కృత్రిమ కాలు ఏర్పాటుకు పూర్తిస్థాయి సహాయ, సహకారాలు అందిస్తామని టీఎస్‌ ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 20వ వార్డుకు చెందిన గుడాల శ్రీనివాస్‌ కాలు రోడ్డు ప్రమాదంలో పోవడంతో పాటు కరోనా కారణంగా తండ్రి ఉద్యోగం పోవడం, సొంత ఇళ్లు లేకపోవడం తదితర విషయాలను సామాజిక మాధ్యమాలు, పత్రికల ద్వారా తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ రూ.3 లక్షల ఎల్‌వోసీని అందించి గొప్ప మనస్సును చాటుకున్నారన్నారు. శ్రీనివాస్‌ కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇంటితో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ప్రతా్‌పరెడ్డి తె లిపారు. ఎల్‌వోసీ వచ్చేందుకు కృషిచేసిన డీసీసీబీ డైరెక్టర్‌ బట్టు అంజిరెడ్డిని అభినందించారు. వారివెంట మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీ, కౌన్సిలర్‌ గోపాల్‌రెడ్డి, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నవాజ్‌మీరా తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-06-12T04:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising