ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2022-05-29T04:50:05+05:30

ఎంపీడీవో వేధింపులు తాళలేక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో జరిగింది. సిద్దిపేటకు చెందిన రాంప్రసాద్‌ రెండు సంవత్సరాలుగా నంగునూరు మండలం పాలమాకుల పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఎంపీడీవో మధుసూదన్‌ తనను టార్గెట్‌ చేసి ఇబ్బంది పెడుతున్నాడని తోటి ఉద్యోగులతో చెప్పుకునేవాడు.

సిద్దిపేటలోని జడ్పీ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్యదర్శుల ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీడీవో వేధిస్తున్నాడని ఆరోపణ    

జడ్పీ కార్యాలయం ఎదుట కార్యదర్శుల ఆందోళన


నంగునూరు, మే 28: ఎంపీడీవో వేధింపులు తాళలేక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో జరిగింది. సిద్దిపేటకు చెందిన రాంప్రసాద్‌ రెండు సంవత్సరాలుగా నంగునూరు మండలం పాలమాకుల పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఎంపీడీవో మధుసూదన్‌ తనను టార్గెట్‌ చేసి ఇబ్బంది పెడుతున్నాడని తోటి ఉద్యోగులతో చెప్పుకునేవాడు. ఈ క్రమంలోనే గ్రామంలోని శ్మశానవాటిక కాంపౌండ్‌ వాల్‌ ఒక్కరోజులోనే కట్టాలని టార్గెట్‌ పెట్టి ఇబ్బందులకు గురిచేసినట్లు బాధితుడు తెలిపారు. అంతే కాకుండా తనను కలెక్టర్‌కు సరెండర్‌ చేస్తానని, ఉద్యోగం నుంచి టర్మినెట్‌ చేయిస్తానని, ప్రజలు, పారిశుధ్య సిబ్బంది ఎదుటే దుర్భాషలాడుతూ వేధించాడని చెప్పారు. ఎంపీడీవో విజిట్‌కు వస్తే రాచమర్యాదలు చేయాలని, లేదంటే కక్షగట్టి వేధిస్తాడని రాంప్రసాద్‌ ఆరోపించారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు జీవితాలపై విరక్తి  చెందుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎంపీడీవో వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన మిత్రులకు శనివారం రాంప్రసాద్‌ వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. బావి వద్ద పురుగుల మందు తాగేందుకు యత్నిస్తుండగా కుటుంబీకులు, మిత్రులు వెళ్లి అడ్డుకున్నారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎంపీడీవో మధుసూదన్‌ స్పందిస్తూ తాను పంచాయతీ సిబ్బందిని వేధించలేదని వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో చేపట్టాల్సిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కార్యదర్శికి సూచించానే తప్ప తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని పేర్కొన్నారు.  


పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

సిద్దిపేట అగ్రికల్చర్‌ : పంచాయతీ కార్యదర్శిపై వేధింపులకు పాల్పడిని నంగునూరు ఎంపీడీవో మధుసూదన్‌పై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు సిద్దిపేటలోని జడ్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పంచాయతీ కార్యదర్శులపై ఉన్నతాధికారులు వేధింపులను ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2022-05-29T04:50:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising