ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయదశమి సంబురం

ABN, First Publish Date - 2022-10-07T05:37:11+05:30

మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో బుధవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆయా వేడుకల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

మెదక్‌ జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల మైదానంలోరావణసురుని దహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో మిన్నంటిన దసరా వేడుకలు  

ఊరూరా శమీ, ఆయుధ పూజలు

దీపావళిని తలపించిన బాణాసంచా వెలుగులు 

వేలాదిగా తరలివచ్చిన ప్రజలు  

వేడుకల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు


 మెదక్‌అర్బన్‌, అక్టోబరు6: మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో బుధవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.  ఆయా వేడుకల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం, వెంకటేశ్వర ఆలయం, మాతాబోరంచమ్మ, బాలాజీమఠం, శిరిడీసాయి తదితర ఆలయాల్లో సందడి నెలకొన్నది. అర్ధరాత్రి వరకు ఆలయాలకు భక్తుల తాకిడి కొనసాగింది. విజయదశమి సందర్బంగా దుకాణాలు, వాహన షోరూంలు, రైస్‌మిల్లులు, పోలీ్‌సస్టేషన్‌, పెట్రోల్‌ బంకులు, మెకానిల్‌ షెడ్లలో ఆయుధ పూజచేశారు. దుర్గాదేవికి హోమాలు, అభిషేకాలు చేసి అమ్మవారికి మొక్కు లు చెల్లించుకున్నారు. సాయంత్రం ఆలయాలలోని జమ్మిచెట్టుకు శమీపూజలను నిర్వహించారు.


మెదక్‌ జిల్లా కేంద్రంలో సందడి

జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో మెదక్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకలల్లో ఎమ్మెలే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయదశమి ప్రజలందరికీ విజయం చేకూర్చాలన్నారు. జిల్లాలో ఉన్న వనరులను వినియోంగిచుకొని మెదక్‌ అభివృద్దికి కృష్టి చేస్తామన్నారు. ఇప్పటికే 500 మందికి రెండు పడకల గదులు అందించామని, మరో అర్హులైన  500 మంది పేదలకు త్వరలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలను అందజేస్తామన్నారు. త్వరలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న కలెక్టరేట్‌ భవనం, ఎస్పీ కార్యాలయం సీఎం కేసీఆర్‌తో ప్రారంభించుకుంటామన్నారు. మంత్రి కేటీఆర్‌ ద్వారా మంచినీటి సరఫరా సమస్య పరిష్కరానికి మిషన్‌ భగీఽరథ పథకానికి రూ.20 కోట్ల మంజూరు కోసం కృషి చేస్తానన్నారు. నిలిచిన మినీ ట్యాంక్‌ బండ్‌కు మరిన్ని నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడుతామన్నారు. అనంతరం ఆక్కడ ఏర్పాటు చేసిన రావణసురునికి నిప్పుపెట్టి దహనం చేశారు. జమ్మి ఆకును బంగారంగా భావిస్తూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ.. శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేలాది మంది రాకతో మైదానం కిక్కిరిసిపోయింది.


ఆకట్టుకున్న బాణసంచా

జూనియర్‌ కళాశాల మైదానంలో బాణాసంచా ఆహుతులను ఆకట్టుకున్నది. దశకంఠుడి దహనంతో వేడుకలు ముగిశాయి. రాత్రి కురిసిని వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, జడ్పీవై్‌సచైర్‌పర్సన్‌ లావణ్యారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బట్టి గణపతి, కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్‌, అంజనేయులు, లక్ష్మీనారాయణగౌడ్‌, సయొవొద్దిన్‌, లలిత, యశోద, రాగి వనజ, ఉత్సవ కమిటీ సభ్యులు గంజి శ్రీనివాస్‌, బొజ్జపవన్‌, కృష్ణాగౌడ్‌, చింతల వినోద్‌, ఉప్పల విఠల్‌దాస్‌, రమేశ్‌ బండ నరేందర్‌, శంకర్‌, శ్యాంరావు, రాగివెంకటేశం పూనరవి, రాయకంటి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు గంగాధర్‌, నాయకులు రాగి అశోక్‌, లింగారెడ్డి, చింతల నర్సింహులు, శివరామకృష్ణ, కొండశ్రీను పాల్గొన్నారు.



Updated Date - 2022-10-07T05:37:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising