ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైశ్యులు సామాజిక సేవలో ముందుండాలి

ABN, First Publish Date - 2022-05-27T05:30:00+05:30

వైశ్యులు సామాజిక సేవలో ముందుండాలని, రాజకీయ రంగంలో రాణించాలని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదరగుప్తా, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఇండస్ట్రియల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అమరావాది లక్ష్మీనారాయణ అన్నారు

మాట్లాడుతున్న ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండపాక, మే 27: వైశ్యులు సామాజిక సేవలో ముందుండాలని, రాజకీయ రంగంలో రాణించాలని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదరగుప్తా, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఇండస్ట్రియల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అమరావాది లక్ష్మీనారాయణ అన్నారు. కొండపాక మండలం కుకునూరుపల్లిలో శుక్రవారం జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైశ్యులకు తగిన ప్రాధాన్యమిస్తూ పదవులు ఇస్తుందన్నారు. అనంతరం ఫారెస్ట్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా కాచం నవీన్‌కుమార్‌తో పాటు కార్యవర్గ సభ్యులు, అనుబంధ శాఖల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో వైశ్య సంఘం ప్రతినిధులు గంప శ్రీనివాస్‌, రత్నాకర్‌, మంచాల శ్రీనివాస్‌, పెద్ది కుమార్‌, పాండు, రాజు, సర్పంచ్‌ పోల్కంపల్లి జయంతి, పీఎన్‌ఆర్‌ చైర్మన్‌ పోల్కంపల్లి నరేందర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అమరేందర్‌, ఈజీఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యులు కోల సద్గుణ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising