ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుపయోగంగా డంపింగ్‌యార్డులు

ABN, First Publish Date - 2022-05-24T05:06:12+05:30

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన డంపింగ్‌యార్డులు అధికారుల నిర్లక్ష్యం మూలంగా నిరుపయోగంగా మారుతున్నాయి.

మద్దూరులో నిరుపయోగంగా మారిన చెత్త డంపింగ్‌యార్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాడలేని సేంద్రియ ఎరువు తయారీ

డంపింగ్‌యార్డుల వద్ద పేరుకుపోతున్న చెత్త

నీటి వసతి ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం

మద్దూరు, మే 23: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన డంపింగ్‌యార్డులు అధికారుల నిర్లక్ష్యం మూలంగా నిరుపయోగంగా మారుతున్నాయి. మద్దూరు మండలంలో ఒక్కో డంపింగ్‌యార్డుకు రూ.2.50 లక్షల చొప్పున 23 గ్రామపంచాయతీలలో రూ.57.50 లక్షలతో ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. డంపింగ్‌యార్డు పరిధిలో ఫెన్సింగ్‌తో పాటు మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టినా నీటి వసతి లేక నిరుపయోగంగా మారాయి. గ్రామాల పరిశుభ్రతకు లక్షలాది రూపాయలతో ట్రాక్లర్లను కొనుగోలు చేసింది. తడి, పొడి చెత్త సేకరణలో భాగంగా గ్రామపంచాయతీలు గ్రామస్థులకు చెత్త బుట్టలను అందించాయి. సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌యార్డుకు చేరవేస్తూ సేంద్రియ ఎరువు తయారు చేయాల్సి ఉంటుంది. అయితే నీటి వసతిపై దృష్టిసారించకపోవడంతో పాటు వానపాముల సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం తోడయింది. దీనివల్ల డంపింగ్‌యార్డుల వద్ద చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. ఇలా పేరుకుపోయిన చెత్తను డంపింగ్‌యార్డుల వద్దనే కాల్చేస్తుండడంతో పరిసరాలు కాలుష్యంతో నిండిపోతున్నాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు యాప్‌ క్రియేట్‌తో అధికారుల బాధ్యతను పెంచినా పనుల్లో పురోగతి లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా డంపింగ్‌యార్డుల వద్ద గ్రీన్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుచేసి ఆహ్లాద వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని సూచించినా.. కొన్ని గ్రామపంచాయతీలు విస్మరించాయి.

Updated Date - 2022-05-24T05:06:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising