ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూప్రాన్‌ చేరుకున్న ‘యూనిటీ ఫ్లేమ్‌ రన్‌’

ABN, First Publish Date - 2022-12-16T00:03:32+05:30

ఎన్‌సీసీ 75 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ‘యూనిటీ ఫ్లేమ్‌ రన్‌’ గురువారం తూప్రాన్‌కు చేరుకున్నది

‘యూనిటీ ఫ్లేమ్‌ రన్‌’కు స్వాగతం పలుకుతున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌, డిసెంబరు 15: ఎన్‌సీసీ 75 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ‘యూనిటీ ఫ్లేమ్‌ రన్‌’ గురువారం తూప్రాన్‌కు చేరుకున్నది. గ్యాలంటరీ సేనా మెడల్‌ విన్నర్‌ కల్నన్‌ క్రిషన్‌సింగ్‌ బధ్వర్‌ ఆధ్వర్యంలో 2022 నవంబరు 20 కన్యాకుమార్‌లో యూనిటీ ఫ్లేమ్‌ రన్‌ ప్రారంభమైంది. 2023 జనవరి 18న ఢిల్లీకి చేరుకుంటుంది. ఢిల్లీలో యూనిటీ ఫ్లేమ్‌ రన్‌ ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్‌సీసీ జెండాను ఆవిష్కరిస్తారు. సుమారు 3వేల కిలోమీటర్ల దూరం సాగనున్న యూనిటీ ఫ్లేమ్‌ రన్‌ను రోజు 50 కిలోమీటర్లు నిర్వహిస్తున్నారు. దాదాపు 60 ప్రాంతాల్లో విడిది చేయనున్నారు. తూప్రాన్‌కు విచ్చేసిన యూనిటీ ఫ్లేమ్‌ రన్‌కు ఎన్‌సీసీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అధికారులు ఘనస్వాగతం పలికారు. తూప్రాన్‌కు విచ్చేసిన యూనిటీ ఫ్లేమ్‌ రన్‌ బృందానికి నలంద కళాశాలలో విడిది ఏర్పాటు చేశారు. స్వాగతం పలికిన వారిలో నలంద విద్యా సంస్థల కరస్పాండెంట్‌ డాక్టర్‌ పీవీ రమణ ఉన్నారు. యూనిటీ ఫ్లేమ్‌ రన్‌ శుక్రవారం ఉదయం తూప్రాన్‌ నుంచి బయలుదేరి కామారెడ్డి జిల్లా బిక్నూర్‌కు చేరుకోనున్నది.

Updated Date - 2022-12-16T00:03:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising