ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాదైనా పూర్తయ్యేనా?

ABN, First Publish Date - 2022-05-21T05:19:41+05:30

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు నత్తతో పోటీపడుతున్నాయి. మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపడానికి చేపట్టిన ఈ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతున్నది. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో రూ.99 కోట్ల వ్యయంతో 107 కిలోమీటర్ల అంతర్గత మురుగుకాల్వల నిర్మాణ పనులను 2020 జూన్‌లో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 7వేల ఇళ్లకు కనెక్టివిటీ ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా కారణంగా పనులు ఆలస్యమయ్యాయి.

గజ్వేల్‌ పట్టణం ఆరో వార్డులో గత వర్షాకాలంలో రోడ్డు దుస్థితి (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో నత్తనడకన యూజీడీ నిర్మాణ పనులు

ఛిద్రమైన అంతర్గత రహదారులు.. నిలిచిపోయిన కొత్త సీసీరోడ్ల నిర్మాణం


గజ్వేల్‌, మే 20: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు నత్తతో పోటీపడుతున్నాయి. మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపడానికి చేపట్టిన  ఈ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతున్నది. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో రూ.99 కోట్ల వ్యయంతో 107 కిలోమీటర్ల అంతర్గత మురుగుకాల్వల నిర్మాణ పనులను 2020 జూన్‌లో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 7వేల ఇళ్లకు కనెక్టివిటీ ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. 


సగం పనులు పెండింగ్‌

2021లో పూర్తికావాల్సిన పనులు ఇప్పటికీ సగమైనా పూర్తికాలేదు. 107 కిలోమీటర్ల మేర పనులకు ఇప్పటి వరకు 104 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తయ్యింది. మరో మూడు కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. అనుమతులు వస్తే ప్రజ్ఞాపూర్‌ రోడ్డు పరిధిలో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. పైప్‌లైన్‌ వేయడం తప్ప మిగిలిన పనులు ఇంకా చేయాల్సి ఉన్నది. ఎస్టీపీల నిర్మాణం దాదాపుగా పూర్తికావస్తున్నది. కానీ పనుల్లో నాణ్యత లోపించిందని, ప్రణాళికా బద్దంగా పనులు చేపట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పైప్‌లైన్‌ ఏర్పాటు పూర్తయినచోట కూడా మ్యాన్‌హాల్స్‌, రోడ్లపై గుంతలతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటింటి కనెక్షన్‌ ఇచ్చే పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభించారు. ఈ ఏడాది దసరా నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు భావించినా మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. అదనంగా 4వేల ఇళ్లకు కనెక్షన్‌ ఇచ్చేందుకు యూజీడీని పొడిగించేందుకు మరో రూ.70 కోట్లు మంజూరు చేయాలని మున్సిపల్‌ పాలకవర్గం  తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆ పనులు ప్రారంభిస్తారు. 


వర్షాలు మొదలైతే ఇబ్బందులే

మూడేళ్లుగా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నందున సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. ఇప్పటికే ఉన్న రోడ్లను కూడా తవ్వేశారు. మ్యాన్‌హోళ్లను ఎత్తుగా నిర్మించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సీసీ రోడ్డు నిర్మించనున్న వీధులలో అందుకు సరిపడా ఎత్తులో మ్యాన్‌హోల్స్‌ను నిర్మించారు. అవే ఇప్పుడు వాహనదారులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పలుచోట్ల మరమ్మతులు చేయించారు. యూజీడీ మూలంగా రోడ్లన్నీ చింద్రమయ్యాయి. వర్షాకాలం సమీపిస్తుండడంతో గతేడాది పడిన ఇబ్బందులు ప్రజలకు గుర్తుకు వస్తున్నాయి. గతేడాది వర్షాకాలంలో గుంతలమయమైన రోడ్లపై ప్రయాణం నరకాన్ని తలపించింది. ఈసారైనా వర్షాలు రాకమందే రహదారులకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-05-21T05:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising