ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండపోచమ్మసాగర్‌లో మునిగి ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2022-05-23T05:26:00+05:30

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  హైదరాబాద్‌కు చెందిన అక్షయ్‌ వెంకట్‌, రాజే్‌షశర్మగా గుర్తింపు


ములుగు, మే 22: సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ములుగు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బోయిన్‌పల్లికి చెందిన రాజే్‌షశర్మ(27), బాచుపల్లికి చెందిన అక్షయ వెంకట్‌(28)తో పాటు రుశభ్‌షా ముగ్గురు స్నేహితులు. ఆ ముగ్గురు ఆదివారం ఉదయం 6.30 గంటల కొండపోచమ్మ జలాశయం చూడడానికి కారులో వచ్చారు. ఈ క్రమంలో రాజే్‌షశర్మ(27) నీటిలోకి దిగాడు. నీటిలో మునిగిపోవడంతో కాపాడేందుకు అక్షయ వెంకట్‌(27) నీటిలోకి దూకాడు. ఆ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ మునిగిపోయారు. ఒడ్డు మీద ఉన్న రుశభ్‌షా నిస్సాహాయ స్థితిలో వెంకట్‌, రాజే్‌షశర్మ తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న గజ్వేల్‌ ఏసీపీ రమేష్‌, ములుగు ఎస్‌ఐ రంగకృష్ణ, మర్కుక్‌ ఎస్‌ఐ శ్రీశైలం సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు నాలుగు గంటలు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


 

Updated Date - 2022-05-23T05:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising