ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ పాలన

ABN, First Publish Date - 2022-03-06T05:10:58+05:30

అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ పాలన అందిస్తున్నదని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలో సీసీ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి రూరల్‌, మార్చి 5: అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ పాలన అందిస్తున్నదని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి మండలంలోని నాగాపూర్‌, ఇరిగిపల్లి, కల్పగూర్‌, కులబ్‌గూర్‌, ఫసల్‌వాది, గౌడిచర్ల, హనుమాన్‌నగర్‌ గ్రామాల్లో శనివారం ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధులతో సీసీ రోడ్లకు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ.8.40 కోట్ల నిధులను విడుదల చేశారని పేర్కొన్నారు. కల్పగూర్‌లోని కాశీవిశ్వేరాలయం, నందికందిలోని ఆలయం, కొండాపూర్‌లోని మ్యూజియానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నదని, ఆయా ఆలయాల అభివృద్ధికి కేంద్రంతో మాట్లాడి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం, మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌, సర్పంచులు పాల్గొన్నారు. గామైక్య సంఘాల సభ్యులు వడ్డీ రూపంలో చెల్లించిన డబ్బును తిరిగి వారి ఖాతాలో వేసినందుకు కృతజ్ఞతలుగా  హనుమాన్‌నగర్‌లో ఎంపీ సమక్షంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.


Updated Date - 2022-03-06T05:10:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising