ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నివర్గాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండ : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-01-20T04:29:21+05:30

అన్నివర్గాల వారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని జహీరాబాద్‌ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అన్నారు.

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జహీరాబాద్‌, జనవరి 19 : అన్నివర్గాల వారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని జహీరాబాద్‌ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన కోహీర్‌లోని రైతువేదికలో 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. ఇదిలా ఉండగా సీఎం సహాయనిధి కింద విడుదలైన రూ.60 వేల చెక్కును టి.శారద అనే మహిళకు అందజేశారు. అలాగే కోహీర్‌కు చెందిన విజయ్‌ అనే యువకుడు గతేడాది మృతిచెందగా, ఆయనకు టీఆర్‌ఎస్‌ సభ్యత్వం ఉండడంతో పార్టీ తరఫున రూ.2 లక్షల బీమా చెక్కును తల్లిదండ్రులకు అందజేశారు. కోహీర్‌లోని మిషన్‌ కాంపౌండ్‌ కాలనీకి చెందిన లావణ్య అనారోగ్యంతో మంగళవారం మృతిచెందగా, ఆమె కుటుంబసభ్యులను, పిల్లలను ఎమ్మెల్యే పరామర్శించారు. బాధిత కుటుంబానికి తన సహాయ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మాచిరెడ్డిపల్లి గ్రామంలో కొన్నిరోజులుగా అనారోగ్యానికి గురైన టీఆర్‌ఎస్‌ మాజీ మండలాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి గృహానికి వెళ్లి ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిచేర్యాగడి గ్రామంలో జరుగుతున్న ఊరడమ్మ జాతరలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో కోహీర్‌ జడ్పీటీసీ జి.రాందాస్‌, ఎంపీపీ మాధవి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కె.నరసింహులు, నాయకులు ఇఫ్తేకార్‌, కాలీమ్‌, జావిద్‌, సంపత్‌, ఆనంద్‌, లింగాల సంగమేశ్వర్‌, రామకృష్ణారెడ్డి, పిచేర్యాగడి సర్పంచ్‌ రవికిరణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T04:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising