ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలును పరిశీలించిన ట్రెయినీ ఐఏఎ్‌సలు

ABN, First Publish Date - 2022-11-30T00:13:34+05:30

ధాన్యం సేకరణపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఒక రోజు శిక్షణలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ ట్రెయినీ అధికారులు మెదక్‌ జిల్లాలో పర్యటించారు. ప్రొబెషనరీ ఐఏఎ్‌సలు రాధికాగుప్తా (ఖమ్మం), శ్రీజ (ఆదిలాబాద్‌), గౌతమి (మంచిర్యాల), పింకె్‌షకుమార్‌, లలిత్‌కుమార్‌ (మహబూబ్‌బాద్‌), లెనిన్‌వత్సవ్‌ (కరీంనగర్‌)తో కూడిన బృందం మంగళవారం నర్సాపూర్‌లో పీఏసీఎస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను, రెడ్డిపల్లిలోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్‌ రైస్‌ మిల్లును సందర్శించారు.

నర్సాపూర్‌లో ధాన్యం కొనుగోలును పరిశీలిస్తున్న ట్రెయినీ ఐఏఎ్‌సలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సాపూర్‌, నవంబరు 29: ధాన్యం సేకరణపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఒక రోజు శిక్షణలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ ట్రెయినీ అధికారులు మెదక్‌ జిల్లాలో పర్యటించారు. ప్రొబెషనరీ ఐఏఎ్‌సలు రాధికాగుప్తా (ఖమ్మం), శ్రీజ (ఆదిలాబాద్‌), గౌతమి (మంచిర్యాల), పింకె్‌షకుమార్‌, లలిత్‌కుమార్‌ (మహబూబ్‌బాద్‌), లెనిన్‌వత్సవ్‌ (కరీంనగర్‌)తో కూడిన బృందం మంగళవారం నర్సాపూర్‌లో పీఏసీఎస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను, రెడ్డిపల్లిలోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్‌ రైస్‌ మిల్లును సందర్శించారు. డీఎ్‌సవో శ్రీనివాస్‌ ధాన్యం సేకరణ విధానాన్ని వారికి వివరించారు. మెదక్‌ జిల్లా వ్యవసాయ ఆధారితమైన జిల్లా అని, ఇక్కడ ప్రధానంగా వరి పండిస్తారని తెలియజేశారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని మరో పది రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిచేస్తామని బృందానికి వివరించారు. వారి వెంట పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ గోపాల్‌, డీఆర్‌డీవో అదనపు పీడీ భీమయ్య, హైదరాబాద్‌ పౌరసరఫరాల శాఖ సహాయ కమిషనర్‌ విశ్వనాథ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌ తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ హరీశ్‌ను కలిసిన ట్రెయినీ అధికారులు

మెదక్‌ అర్బన్‌, నవంబరు 29: జిల్లా భౌగోళిక పరిస్థితులను, ప్రజల జీవన విధానాన్ని తెలుసుకున్నప్పుడే పదవికి సంపూర్ణ న్యాయం చేయగలుగుతామని జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ ఐఏఎస్‌ అధికారులకు హితవు పలికారు. ట్రైనీ అధికారులు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ హరీశ్‌, అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్‌, రమేశ్‌ను మార్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ మొదలు మిల్లులకు తరలించి, రైతులకు డబ్బు చెల్లించే వరకు వివిధ స్థాయిల్లో జరిగే ప్రక్రియను కలెక్టర్‌ ఐఏఎస్‌ బృందానికి వివరించారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల తర్వాత అత్యధికంగా పంట వచ్చేది మెదక్‌ జిల్లాలోనే అని, అధికారుల సమష్టి కృషి, సమన్వయంతో జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా సాగుతోందన్నారు. ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 90 శాతం ధాన్యాన్ని సేకరించామన్నారు. మరో వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల సందర్శన సందర్భంగా పరిశీలించిన అంశాలు, ఇంకా మెరుగుపర్చాల్సిన అంశాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని ట్రైనీ అధికారులను కలెక్టర్‌ కోరారు. శిక్షణ అనంతరం జిల్లాలకు వెళ్లనున్న ప్రొబెషనరీ ఐఏఎస్‌ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-11-30T00:13:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising