ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూప్రాన్‌లో వ్యాపారుల ఆందోళన

ABN, First Publish Date - 2022-08-06T05:30:00+05:30

పట్టణంలో శనివారం కూరగాయల వ్యాపారులు అమ్మకాలను నిలిపివేసి ఆందోళన చేపట్టారు.

పాత కూరగాయల మార్కెట్‌లో నిరసన చేస్తున్న వ్యాపారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టెంట్‌ వేసుకుని నిరసన.. అక్కడే వంటావార్పు

తూప్రాన్‌, ఆగస్టు 6: పట్టణంలో శనివారం కూరగాయల వ్యాపారులు అమ్మకాలను నిలిపివేసి ఆందోళన చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి సైతం కూరగాయలు రాకుండా అడ్డుకున్నారు. తూప్రాన్‌లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌లో కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులను ఒప్పించారు. శుక్రవారం సాయంత్రం డ్రా పద్దతిలో దుకాణాల కేటాయింపు చేసేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ వద్దకు రప్పించారు. అక్కడ దుకాణాల సంఖ్య తక్కువగా ఉండటంతో, ఒక్కొక్క దుకాణాన్ని ఇద్దరికి కేటాయించేందుకు మార్కెటింగ్‌ అధికారులు సిద్ధపడ్డారు. తాము 40 మంది వ్యాపారులున్నామని, 40 దుకాణాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ వద్దే నిరసన తెలిపారు. ఈ మేరకు శనివారం నుంచి కూరగాయల అమ్మకం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాత మార్కెట్‌లో దుకాణాల వద్ద టెంటును ఏర్పాటు చేసి వ్యాపారులందరు నిరసన తెలిపారు. అక్కడే వంటకాలు చేసుకొని వంటావార్పు చేపట్టారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు తమకు న్యాయం చేయాలని కూరగాయల వ్యాపారుల అసోసియేషన్‌ అఽధ్యక్షుడు పసుల తిరుపతి, మర్రి ఓంప్రకా్‌ష కోరారు.  కూరగాయల వ్యాపారుల ఆందోళనకు సీఐటీయూ జిల్లా ఉపాఽధ్యక్షుడు మహేందర్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. 50ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్న కూరగాయల వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.   

Updated Date - 2022-08-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising