ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టమాట ఢమాల్‌!

ABN, First Publish Date - 2022-12-16T23:52:14+05:30

చిన్నకోడూరుకు చెందిన నాగరాజు మండలంలోని పెద్దకోడూరు శివారులో ఉన్న తన వ్యవసాయ బావి వద్ద 30 గుంటల్లో టమాట పంటను సాగు చేశాడు. సాగు కోసం రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాడు.

చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు శివారులో టమాట చేనులో మేస్తున్న పశువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పడిపోయిన ధర

కూలీ, రవాణా ఖర్చులు రాని వైనం

చేనులోనే వదిలేస్తున్న రైతులు

చిన్నకోడూరు, డిసెంబరు 16 : చిన్నకోడూరుకు చెందిన నాగరాజు మండలంలోని పెద్దకోడూరు శివారులో ఉన్న తన వ్యవసాయ బావి వద్ద 30 గుంటల్లో టమాట పంటను సాగు చేశాడు. సాగు కోసం రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. పంట దిగుబడి కూడా బానే వచ్చింది. తీరా మార్కెట్‌కు తరలించాక టమాట ధర పడిపోయింది. మొత్తంగా కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాలేదు. చేసేదేమీ లేక పంటను పశువులకు మేపుతున్నాడు. విఠలాపూర్‌ గ్రామానికి చెందిన మాచిరెడ్డి యాదిరెడ్డి కూడా ఎకరంలో టమాట సాగు చేశాడు. సాగు కోసం రూ.40వేల వరకు ఖర్చు చేశారు. మార్కెట్‌లో టమాట ధర పడిపోవడంతో పంటను చేనులోనే వదిలేశారు. ఇలా అనేక గ్రామాల్లో టమాట సాగు చేసిన రైతులు మార్కెట్‌లో ధర లేక, పెట్టుబడి రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ యేటా టమాట పంట రైతులకు నష్టాలనే మిగుల్చుతున్నది. మార్కెట్‌లో ధర ఉంటే పంట సరిగా ఉండదు. పంట బాగా పండితే మార్కెట్‌లో ధర ఉండడం లేదు. హోల్‌సెల్‌గా కిలో రూ.2నుంచి రూ.3వరకు అమ్ముడుపోతున్నది. చిన్నకోడూరు మండలవ్యాప్తంగా 2,119 మంది రైతులు 1,642 ఎకరాల్లో కూరగాయాలు సాగుచేశారు. అందులో 224 మంది రైతులు సుమారుగా 135 ఎకరాల్లో టమాట సాగుచేశారు. అధిక వర్షాల వల్ల చాలాచోట్ల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మొదటి వారం వరకు మార్కెట్‌లో కిలో టమాట రూ.30 నుంచి రూ.40 వరకు ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాట రూ.8 ఉంది. రైతులకు కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. కాసుల వర్షం కురిపిస్తుందన్న టమాట, ధర లేక దు:ఖాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T23:52:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising