ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ‘మన తెలంగాణ.. మన బతుకమ్మ’ సంబురాలు

ABN, First Publish Date - 2022-09-30T05:06:42+05:30

మెదక్‌ పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో శుక్రవారం మన తెలంగాణ.. మన బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ తెలిపారు.

మెదక్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న చైర్మన్‌ చంద్రపాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహణ

మెదక్‌ మున్సిపాలిటీ, సెప్టెంబరు 29: మెదక్‌ పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో శుక్రవారం మన తెలంగాణ.. మన బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ తెలిపారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆదేశాలతో చేపడుతున్నట్లు గురువారం ఆయన చెప్పారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే సంబురాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి పాల్గొంటారని తెలిపారు. కాగా పాతబస్టాండ్‌ నుంచి ఖిల్లా వరకు సీసీ రోడ్డు నిర్మాణాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ గురువారం ప్రారంభించారు. ఆయనవెంట కమిషనర్‌ శ్రీహరి, డీఈ మహేష్‌, నాయకులు బొద్దుగుల కృష్ణ, ఏఈ బాలసాయాగౌడ్‌ ఉన్నారు. 


రేపు చెల్కా తండాకు ఎమ్మెల్సీ కవిత

కల్హేర్‌: బల్కం చెల్కాతండాలోని విశ్వపాలిని జ్వాలాముఖి భవానీ మాతా, సంత్‌ సేవాలాల్‌ ఆలయం ఆవరణలో శనివారం నిర్వహించే బతుకమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నట్లు నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలిపారు. తెంగాణా జాగృతి రాష్ట్ర నాయకులు మఠం భిక్షపతి, ఆలయాల ధర్మకర్త మూడ్‌ కిషన్‌నాయక్‌తో కలిసి గురువారం ఎమ్మెల్యే ఏర్పాట్లను పరిశీలించారు. ఆయనవెంట ఖేడ్‌ వైస్‌ ఎంపీపీ సాయిరెడ్డి, నిజాంపేట సర్పంచ్‌ జగదీ్‌షచారి ఉన్నారు. 

Updated Date - 2022-09-30T05:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising