అంగడికిష్టాపూర్‌లో గ్రామకంఠం భూములకు పట్టాలు
ABN, First Publish Date - 2022-10-18T05:28:02+05:30
మర్కుక్ మండలంలోని అంగడికిష్టాపూర్ గ్రామకంఠం భూములకు భూయాజమాన్య హక్కు పత్రాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ పేర్కొన్నారు. సోమవారం మర్కుక్ మండలం అంగడికిష్టాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు వారు ముఖ్యఅతిథిలుగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ భూములకు ఉన్నవిధంగానే వ్యవసాయేతర భూములకు పట్టాలు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఇందుకోసం జిల్లాలోని అంగడికిష్టాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని గుర్తుచేశారు
త్వరలో యాజమాన్య హక్కు పత్రాలు అందజేస్తాం
పైలట్ ప్రాజెక్టు విజయవంతం
సర్వే నివేదిక ముఖ్యమంత్రికి అందజేస్తాం
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చర్యలు
రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు
జగదేవ్‌పూర్, అక్టోబరు 17 : మర్కుక్ మండలంలోని అంగడికిష్టాపూర్ గ్రామకంఠం భూములకు భూయాజమాన్య హక్కు పత్రాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ పేర్కొన్నారు. సోమవారం మర్కుక్ మండలం అంగడికిష్టాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు వారు ముఖ్యఅతిథిలుగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ భూములకు ఉన్నవిధంగానే వ్యవసాయేతర భూములకు పట్టాలు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఇందుకోసం జిల్లాలోని అంగడికిష్టాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని గుర్తుచేశారు. రెండు నెలలు గ్రామంలో అధికారుల బృందం సర్వే చేసి గ్రామ కంఠం భూముల హద్దులను గుర్తించారని వివరించారు. డ్రోన్ కెమెరా ద్వారా సర్వే చేయడంతో పాటు, అధికారుల బృందం ఇంటింటికి వెళ్లి విచారణ చేపట్టి హద్దులను నిర్ధారించారని తెలియజేశారు. గ్రామంలోని 341 కుటుంబాలకు భూముల హద్దులను నిర్ణయించామని తెలిపారు. అంగడికిష్టాపూర్‌లో ఈ ప్రాజెక్టు సంపూర్ణంగా విజయవంతమైందని పేర్కొన్నారు. గ్రామకంఠం భూములను యాజమాని, కుటుంబసభ్యుల వివరాలతో పాసుపుస్తకాలను అందజేయనున్నట్లు వెల్లడించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22 వరకు గ్రామ ప్రజల నుంచి స్వీకరిస్తామన్నారు. ఇందుకోసం గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులను అందుబాటులో ఉంచామని వారు తెలిపారు. గ్రామ సర్వే నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించనున్నట్లు వెల్లడించారు. సీఎం నిర్ణయం తర్వాత త్వరలోనే అంగడికిష్టాపూర్ గ్రామస్థులకు గ్రామకంఠం భూములకు పట్టాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ తదుపరి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్‌వెస్లీ, రవీందర్‌రావు, డ్రోన్ కెమారాల డైరెక్టర్ శ్రీనివా్‌సరెడ్డి, గడ అధికారి ముత్యంరెడ్డి, గజ్వేల్ ఆర్డీవో విజేందర్‌రెడ్డి, డీపీవో దేవకిదేవి, సర్పంచ్ దుద్దెడ లక్ష్మీరాములుగౌడ్, ఎంపీటీసీ గోలి నరేందర్, ఉపసర్పంచ్ కొండల్‌రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దారు భవాని, ఎంపీవో రాజలింగం, పీఆర్ డీఈ ప్రభాకర్, మాజీ సర్పంచ్ శ్యాంసుందర్, గ్రామస్థులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:28:02+05:30 IST