ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా గ్రామంలో స్టోన్‌ క్రషర్‌ వద్దు

ABN, First Publish Date - 2022-08-17T04:52:59+05:30

మండలంలోని ఊట్ల గ్రామంలో నూతన స్టోన్‌ క్రషర్‌ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ నిలిపి వేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టరేట్‌ వద్ద ఊట్ల గ్రామస్థుల ధర్నా.. కలెక్టర్‌కు ఫిర్యాదు

జిన్నారం, ఆగస్టు 16: మండలంలోని ఊట్ల గ్రామంలో నూతన స్టోన్‌ క్రషర్‌ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ నిలిపి వేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ శరత్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఎంపీపీ ఉపాధ్యక్షుడు గంగు రమేష్‌, సర్పంచ్‌ ఆంజనేయులు, ఉప సర్పంచ్‌ రవి, మాజీ సర్పంచ్‌ జింకల శివరాజ్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి తరలివెళ్లి ధర్నా నిర్వహించారు. గ్రామ శివారులో కొత్తగా స్టోన్‌ క్రషర్‌ ఏర్పాటు కోసం ఈనెల 27న తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను  వ్యతిరేకిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని, వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, కలెక్టర్‌ శరత్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు జిన్నారంలో తహసీల్దార్‌ దశరథకు వినతి పత్రం అందజేశారు.  

Updated Date - 2022-08-17T04:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising