ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్‌ తిరగబడి కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2022-12-31T00:19:51+05:30

ట్రాక్టర్‌ ఇంజన్‌ తిరబడిన ఘటనలో ఓ వలస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఇంజన్‌, ట్రాలీ మధ్య ఇరుక్కున్న కూలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట రూరల్‌, డిసెంబరు 30: ట్రాక్టర్‌ ఇంజన్‌ తిరబడిన ఘటనలో ఓ వలస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన సిద్దిపేట రూరల్‌ మండలం రావురూకుల గ్రామశివారులోని ఇటుకబట్టి వద్ద శుక్రవారం చోటుచేసుకున్నది. సిద్దిపేట రూరల్‌ పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 15 కుటుంబాలవారు రావురూకుల గ్రామంలోని ఇటుకల బట్టిలో పని చేస్తున్నారు. శుక్రవారం తయారు చేసిన ఇటుకలను బట్టికి పేర్చేందుకు ఉగ్ర సినోర (34) అనే కూలీ ట్రాక్టర్‌లో తీసుకెళ్లగా, మట్టిలో దిగబడింది. దాన్ని బయటకు తీసే యత్నంలో ట్రాక్టర్‌ ఇంజన్‌ స్పీడ్‌ పెరగడంతో ఒక్కసారిగా ఇంజన్‌ రివర్స్‌లో తిరగబడింది. దీంతో ఉగ్రసినోర ఇంజన్‌, ట్రాలీ మధ్యన ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. సిద్దిపేట రూరల్‌ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. మృతదేహానికి పంచనామ చేసి, పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2022-12-31T00:22:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising