ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోల్‌ప్లాజాకు తూప్రాన్‌ పేరు పెట్టాలి

ABN, First Publish Date - 2022-01-29T04:49:03+05:30

తూప్రాన్‌ పట్టణ శివారులో ఉన్న టోల్‌ప్లాజాకు తూప్రాన్‌ టోల్‌ప్లాజాగా పేరు పెట్టాలని మున్సిపల్‌ సమావేశంలో తీర్మానం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మున్సిపల్‌ సమావేశంలో తీర్మానం


తూప్రాన్‌, జనవరి 28: తూప్రాన్‌ పట్టణ శివారులో ఉన్న టోల్‌ప్లాజాకు తూప్రాన్‌ టోల్‌ప్లాజాగా పేరు పెట్టాలని మున్సిపల్‌ సమావేశంలో తీర్మానం చేశారు. మనోహరాబాద్‌ టోల్‌ప్లాజాగా పెరున్నా.. తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నందున పేరు మార్పు చేయాలని తీర్మానించారు. శుక్రవారం మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ అధ్యక్షతన మున్సిపల్‌ సమావేశం నిర్వహించారు. హైవే విస్తరణలో మనోహరాబాద్‌ వద్ద టోల్‌ప్లాజా ఏర్పాటుకు ఎన్‌హెచ్‌ఏఐ నిర్ధారించినప్పటికీ, కోర్టు వివాదంతో అల్లాపూర్‌ (ప్రస్తుతం తూప్రాన్‌ పట్టణం) శివారులో ఏర్పాటు చేశారన్నారు. మనోహరాబాద్‌ టోల్‌ప్లాజా పేరును తొలగించి తూప్రాన్‌ టోల్‌ప్లాజాగా మార్పు చేయాలని తీర్మానించారు. తూప్రాన్‌ పట్టణంలో నూతనంగా నిర్మించిన మున్సిపల్‌ భవనంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు మంత్రి హరీశ్‌రావుతో ప్రారంభోత్సవానికి రూ.29 లక్షల ఖర్చుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 11వ వార్డు (పడాలపల్లి)లో శ్మశానవాటిక ఏర్పాటుకు స్థలం గుర్తించి మున్సిపాలిటీకి స్వాధీనం చేయాలని కలెక్టర్‌ను కోరుతూ తీర్మానించారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, కమిషనర్‌ మోహన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-01-29T04:49:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising