ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించాలి

ABN, First Publish Date - 2022-05-24T05:01:26+05:30

సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని విడిచి టూర్లకు వెళ్లడం కాదని, ముందుగా పెట్రోల్‌, డీజీల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ నాయకుల డిమాండ్‌

చిన్నశంకరంపేట/రామాయంపేట/పెద్దశంకరంపేట/కొండాపూర్‌, మే 23: సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని విడిచి టూర్లకు వెళ్లడం కాదని, ముందుగా పెట్రోల్‌, డీజీల్‌పై వ్యాట్‌ను  తగ్గించాలని బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన చిన్నశంకరంపేటలో మాట్లాడుతూ సామాన్యలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజీల్‌ ధరలను తగ్గించిందన్నారు. పెట్రోల్‌, డీజీల్‌పై వ్యాటు తగ్గించేవరకు బీజేపీ పోరాడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌తో పాటు గ్యాస్‌ ధరలను తగ్గించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్‌ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పోచమ్మల అశ్విని అన్నారు. ఈ మేరకు రామాయంపేటలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించాలన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ను తగ్గించాలని పెద్దశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షుడు కోణంవిఠల్‌ సోమవారం డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజీల్‌, వంటగ్యాస్‌ ధరలను తగ్గించినందుకు ప్రధాని మోదీ చిత్రపటానికి కొండాపూర్‌ మండల బీజేపీ నాయకులు సోమవారం క్షీరాభిషేకం చేశారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు సాయికుమార్‌ ఆధ్వర్యంలో బీజేపీ అధికార ప్రతినిధి నేమలికొండ హరీశ్‌కుమార్‌, నాయకులు సత్తెమ్మ, గొల్ల మల్లేశం, ఎల్లయ్య, ఆంజనేయులు, వీరేశం, వేమారెడ్డి, ప్రశాంత్‌ క్షీరాభిషేకంలో పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:01:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising