ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్టీయూతోనే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం

ABN, First Publish Date - 2022-12-31T23:06:59+05:30

జగదేవ్‌పూర్‌, డిసెంబరు 31: పీఆర్టీయూతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్‌శర్మ పేర్కొన్నారు.

జగదేవ్‌పూర్‌లో పీఆర్టీయూ క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న శశిధర్‌శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగదేవ్‌పూర్‌, డిసెంబరు 31: పీఆర్టీయూతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్‌శర్మ పేర్కొన్నారు. పీఆర్టీయూ మండలశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీఎం కేసీఆర్‌ను కలిశారన్నారు. ప్రభుత్వాన్ని ఒప్పించి ఉపాధ్యాయుల బదిలీలు జరిపించడంతో పాటు 2023 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేస్తూ సీపీఎ్‌సను పూర్తిగా రద్దుచేయాలని, పండిట్‌ పీఈటీ అక్రిడేషన్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు ప్రక్రియ కూడా ఉంటుందని శశిధరశర్మ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అంకితభావంతో టీఎల్‌ఎం ద్వారా అద్భుతమైన విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉదయ భాస్కర్‌రెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రాంరెడ్డి, శేఖర్‌, కాంప్లెక్స్‌ ప్రధాన ఉపాధ్యాయులు కే.విజయకుమార్‌ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌, మహిళా ఉపాధ్యక్షురాలు రాధిక, మండల కార్యదర్శి మోతీరామ్‌, ఉపాధ్యాయులు బొద్దు నగేష్‌, బాల నరసింహారెడ్డి, నరేందర్‌రెడ్డి, సావిత్రి, సంతోష్‌, కుమారి, కనకదుర్గ, శోభ, సునీత, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising