ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-09-14T04:49:26+05:30

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు తిరుపతిరెడ్డి డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న తిరుపతిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు తిరుపతిరెడ్డి

సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు 13: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు తిరుపతిరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో పోలీసు నిర్బంధాలను అధిగమిస్తూ చలో అసెంబ్లీకి తరలివెళ్లిన టీపీటీఎఫ్‌ సిద్దిపేట జిల్లా ప్రతినిధులను అసెంబ్లీ సమీపంలో అక్రమంగా అరెస్ట్‌ చేసి నాంపల్లి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తరలివెళ్లిన నాయకులను అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేసి దసరా సెలవుల్లో పూర్తి చేయాలని, సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో తాత్కాలికంగానైనా వాలంటీర్లను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తితే అక్రమ అరెస్టులా?

దుబ్బాక/మిరుదొడ్డి, సెప్టెంబరు 13: ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తి, నిరసన తెలపాలనుకున్న ఉపాధ్యాయులను అక్రమంగా నిర్బంధించడం దారుణమని యూఎ్‌సపీసీ (టీపీటీఎఫ్‌) జిల్లా నాయకులు విజయేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మల్లేశం మండిపడ్డారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపట్టాలనుకున్న గురువులను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. 

Updated Date - 2022-09-14T04:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising