ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ చైర్మన్‌ పదవిని రెడ్డి కులస్థులకు కేటాయించాలి

ABN, First Publish Date - 2022-01-23T04:05:24+05:30

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పదవిని రెడ్డి కులస్థులకు కేటాయించాలని కోరుతూ రెడ్డి జేఏసీ నాయకులు శనివారం దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు.

దేవాదాయశాఖామంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న రెడ్డి జేఏసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, జనవరి 22 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పదవిని రెడ్డి కులస్థులకు కేటాయించాలని కోరుతూ రెడ్డి జేఏసీ నాయకులు శనివారం దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. కొమురవెల్లి మల్లన్న నీలమాంబ-ఆదిరెడ్డిల తనయుడని, బలిజ మేడలాదేవీ, గొల్ల కేతలమ్మను వివాహమాడటంతో ఆయా సామాజికవర్గాల వారు సేవలు అందిస్తున్నారన్నారు. మల్లన్న ఆలయ చరిత్ర దృష్ట్యా స్వామివారి కల్యాణం సందర్భంగా రెడ్డి కులస్తుల తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించే అవకాశం కల్పించాలని కోరారు. ఆలయంలో జరిగే సేవా కార్యక్రమంలో ప్రాధాన్యం కల్పించాలని, చైర్మన్‌ పదవిని రెడ్డిలకు కేటాయిస్తే వసతిగతులు, మౌలిక వసతుల కల్పనతో ఆలయం అభివృద్ధి చెందడంతో పాటు భక్తులకు ఇక్కట్లు తొలగిపోతాయన్నారు. లేనియెడల ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి రాజిరెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌ మహిళా అధ్యక్షురాలు విజితారెడ్డి, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు వట్టిపల్లి రాజిరెడ్డి, నాయకులు నరెడ్ల శ్రీనివా్‌సరెడ్డి, నిమ్మ మహిపాల్‌రెడ్డి, శెట్టిపల్లి విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T04:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising