గాయపడిన వ్యక్తి చికిత్సపొందుతూ మృతి
ABN, First Publish Date - 2022-10-18T05:03:04+05:30
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్సపొందుతూ మృతిచెందిన ఘటన మండలకేంద్రంలో చోటు చేసుకుంది.
కౌడిపల్లి, అక్టోబరు 17: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్సపొందుతూ మృతిచెందిన ఘటన మండలకేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మండలకేంద్రానికి చెందిన షేక్ ఇస్మాయిల్(54) ఈనెల 5న కౌడిపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్డును దాటుతుండగా మెదక్ వైపు వెళ్తున్న కారు ఢీ కొన్నది. దీంతో తీవ్ర గాయలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా షేక్ ఇస్మాయిల్ ఆదివారం రాత్రి చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు షెర్ ఫాజిల్ ఫిర్యాదు మేరకు ఏఎ్‌సఐ విఠల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-10-18T05:03:04+05:30 IST