ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ABN, First Publish Date - 2022-05-18T05:20:06+05:30

విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని టీఎస్‌ ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, టీఎ్‌సఈడబ్ల్యూఐడీసీ చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి అన్నారు.

గడ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతున్న ప్రతా్‌పరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, టీఎ్‌సఈడబ్ల్యూఎ్‌సఐడీసీ చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి

గజ్వేల్‌, మే 17: విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని టీఎస్‌ ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, టీఎ్‌సఈడబ్ల్యూఐడీసీ చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌లోని గడ కార్యాలయంలో మంగళవారం గజ్వేల్‌ నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టిసారించి ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. చదువుకున్న బడుల పునరుద్ధరణకు పూర్వ విద్యార్థులు తమవంతుగా సహాయ, సహకారాలు అందించాలని కోరారు. అనంతరం ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందన్న లక్ష్యంతో రూ.54 కోట్లతో సీఎం కేసీఆర్‌ ప్రతి గ్రామంలో పాఠశాలల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. గజ్వేల్‌ లో ఏర్పాటుచేసిన ఎడ్యుకేషన్‌ హబ్‌తో విద్యాభివృద్ధికి బాటలు వేసినట్లు అయిందని, ముఖ్యంగా ఎడ్యుకేషన్‌హాబ్‌లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు, హాస్టల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారివెంట గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మాదాసు అన్నపూర్ణ, జిల్లా విద్యాధికారి రవికాంతారావు, గజ్వేల్‌ ఎంఈవో సునీత, ఈడబ్ల్యూఐడీసీ ఈఈ శ్రీనివా్‌సరెడ్డి, డీఈఈ మధుసూదన్‌రావు, ఆయా మండలాల ఎంఈవోలు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. 

Updated Date - 2022-05-18T05:20:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising