ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చారిత్రక కట్టడానికి పూర్వ వైభవం

ABN, First Publish Date - 2022-04-29T05:29:35+05:30

జోగిపేటలోని 159 ఏళ్ల నాటి చారిత్రాత్మక కట్టడం క్లాక్‌టవర్‌కు పూర్వ వైభవం రానున్నది.

జోగిపేటలోని క్లాక్‌టవర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్లాక్‌టవర్‌ మరమ్మతులు షురూ

ఈ నెల 26న ప్రారంభమైన పనులు   

జోగిపేట, ఏప్రిల్‌ 27: జోగిపేటలోని 159 ఏళ్ల నాటి చారిత్రాత్మక కట్టడం క్లాక్‌టవర్‌కు పూర్వ వైభవం రానున్నది.  1863లో అప్పటి ఐదో నిజాం రాజు నవాబ్‌ అఫ్జలుద్దౌలా హయాంలో గ్రామ నడిబొడ్డున గడియారపు గోపురం నిర్మించారు. ఇది గ్రామంలో మధ్యలో ఉండడం వల్ల ‘మధ్యరంగం’ అని ప్రజలు పిలువసాగారు. అయితే కొంత కాలంగా పాలకులు, ప్రజల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో ఈ కట్టడం ధీనస్థితికి చేరుకున్నది. చెట్లు మొలవడంతో పాటు క్లాక్‌టవర్‌ పైకప్పులో కూడా పగుళ్లు ఏర్పడి వర్షాకాలంలో నీరు లీకై కట్టడానికి ప్రమాదమేర్పడింది. అలాగే గోడ గడియారాలు కూడా పనిచేయకుండా పోయాయి. కట్టడానికి జరుగుతున్న నష్టంపై గతంలో ‘ఆంధ్రజ్యోతి’ చారిత్రాత్మక కట్టడానికి పెద్ద కష్టం పేరిట కథనం సైతం ప్రచురించింది.  రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే క్రాతికిరణ్‌ క్లాక్‌టవర్‌ను, గడియారాలను బాగు చేయించాలని సికింద్రాబాద్‌లోని రమేశ్‌ వాచ్‌ కంపెనీ వారిని సంప్రదించారు. గతేడాది రూ. 8.50 లక్షల నిధులను క్లాక్‌టవర్‌ మరమ్మతుల కోసం కేటాయించారు. కరోనా విజృంభించడంతో మధ్యలో పనులు ఆగిపోగా, రమేశ్‌ వాచ్‌ కంపెనీ వారు సోమవారం(ఈనెల 26న) తిరిగి పనులను ప్రారంభించారు. జీపీఎస్‌ అనుసంధానిత గడియారాలను ఇక్కడ బిగించనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వీటికి తరచూ రిపేర్‌ అవసరం లేదని, మాటిమాటికీ, సమయాన్ని సరిచేయాల్సిన అవసరం లేదన్నారు. ఇవి జీపీఎస్‌ సిస్టం ఆధారంగా వాటంతట అవే సమయాన్ని సరిచేసుకుంటాయని వివరించారు. కాగా చారిత్రక కట్టడం క్లాక్‌టవర్‌ను జాతీయ వారసత్వ సంపదగా గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2022-04-29T05:29:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising